- ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ
పాల్వంచ, వెలుగు : ఇటీవల ప్రపం చవ్యాప్తంగా నిర్వహిస్తున్న పలు క్రీడల్లో మహిళలు విశేష ప్రతిభ కనబరుస్తున్నారని, ఇదే స్ఫూర్తితో గ్రామీణ స్థాయి నుంచి విద్యార్థినులు మరింత నైపుణ్యం చూపాలని భద్రాద్రికొత్తగూడెం ట్రైనీ కలెక్ట ర్ సౌరబ్ శర్మ సూచించారు.
శుక్రవారం పట్టణంలోని శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో అస్మిత లీగ్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేలో ఇండియాలో భాగంగా విద్యార్థులను గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకువెళ్లాలని లక్ష్యంతో ఈ కార్య క్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లా క్రీడల అధికారి పరంధామరెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అస్మిత అబ్జర్వర్ వినోద్, ఆనంద కోరి, ఒలంపిక్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడు డాక్టర్ యుగంధర్ రెడ్డి, అనంత రాములు, ప్రశాంత్, నవ్య, రాణి, రాజేశ్వరి, పవన్, సోమరాజు, కోచ్ లు ఎర్రయ్య, అక్బర్, మల్లికార్జున్, వివిధ పాఠశాలల పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
