టైమ్ కు రాని ఉద్యోగులకు ఒక రోజు జీతం కట్

టైమ్ కు రాని ఉద్యోగులకు ఒక రోజు జీతం కట్
  •  భద్రాద్రి కలెక్టరేట్ లోని పలు 
  • ఆఫీస్​లను తనిఖీ చేసిన కలెక్టర్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రికొత్తగూడెం ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్​లో గురువారం కలెక్టర్​ అంకిత్​ హల్​చల్​ చేశారు. విద్య, ఎస్సీ వెల్ఫేర్, పౌరసరఫరాల శాఖ, కార్మిక శాఖ, ఉపాధి కల్పన శాఖ, వైద్యారోగ్య శాఖల ఆఫీస్​లను తనిఖీ చేశారు. ఆఫీస్​ టైం అవుతున్నా ఎందుకు డ్యూటీకి రాలేదని ప్రశ్నించారు. సరైన కారణాలు లేకుండా ఆలస్యంగా డ్యూటీకి వస్తుండడంతో కలెక్టర్​ అసహనం వ్యక్తం చేశారు. 

10.30 దాటుతున్నా సిబ్బంది ఆఫీస్​కు రాకపోవడం, ఆఫీసర్లు పట్టించుకోకపోవడంపై  అసంతప్తి వ్యక్తం చేశారు. హాజరు రిజిష్టర్లను పరిశీలించి, పౌరసరఫరాల శాఖ అధికారి లేకపోవడంతో ఫోన్​ చేసి మాట్లాడారు. హెల్త్​ డిపార్ట్​మెంట్, డీసీహెచ్ఎస్​ ఆఫీస్​లో సీనియర్, జూనియర్​ అసిస్టెంట్లు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా డ్యూటీకి వచ్చిన ఉద్యోగుల ఒక రోజు జీతం కట్  చేయాలని అధికారులను ఆదేశించారు.