10 వేల మందితో అమెరికాలో మార్మోగిన భగవద్గీత పారాయణం..

10 వేల మందితో అమెరికాలో మార్మోగిన భగవద్గీత పారాయణం..

అమెరికాలోని టెక్సాస్‌లో గురు పూర్ణిమ సందర్భంగా జరిగిన భగవద్గీత పారాయణంలో జులై​4న 10 వేల మంది పాల్గొన్నారు. యోగా సంగీత, ఎస్‌జీఎస్‌ గీత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భగవద్గీత పారాయణ యాగం నిర్వహించారు. మైసూరులోని అవధూత దత్త పీఠం ఆశ్రమం సమాచారం ప్రకారం.. ఆధ్యాత్మిక సాధువు గణపతి సచ్చిదానంద్ పారాయణానికి నాయకత్వం వహించారు. అవధూత దత్త పీఠం1966లో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ  ప్రారంభించిన ఆధ్యాత్మిక సంస్థ.  

Also Read : ఆసక్తిరేపుతున్న మంగళవారం టీజర్.. అజయ్కి ఈ సారి హిట్ గ్యారంటీ

టెక్సాస్‌లో భగవద్గీతను పఠించిన 10,000 మంది ప్రజలు తమ గురువు గణపతి సచ్చిదానంద్ స్వామి మార్గదర్శకత్వంలో ఎనిమిది సంవత్సరాలుగా పారాయణాన్ని కంఠస్థం చేశారు. అమెరికాలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే తొలిసారి కాదు. స్వామి కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అమెరికాలో హిందూ ఆధ్యాత్మికతను వ్యాప్తి చేస్తున్నారు.

మహాదేవ్​ ఆలయానికి తరలివచ్చిన భక్తులు..

ఢిల్లీ ఆగ్రాలోని రావత్‌పరా మంకమేశ్వర్ మహాదేవ్ ఆలయానికి దేశ  నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు.  భక్తులు తెల్లవారుజాము నుంచే శివాలయాల్లో విశేషంగా పూజలు నిర్వహించారు. "సావన్ మాసంలో తొమ్మిది సోమవారాలుంటాయి. ఈ రోజుల్లో పవిత్ర స్నానం ఆచరిస్తారు." అని మహంత్ యోగేష్ పూరి చెప్పారు.