మూడింటిలో ఇదే కామన్ పాయింట్.. ఆడియన్స్ గమనించారా!?

మూడింటిలో ఇదే కామన్ పాయింట్.. ఆడియన్స్ గమనించారా!?

దసరా అంటే సినిమాల పండుగ. దసరా కానుకగా రిలీజయ్యే సినిమాల కోసం ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు ఎదురు చూస్తుంటారు.  ప్రస్తుతం ఈ దసరాకు రిలీజైనా మూడు సినిమాలు బాక్సాపీస్ వద్ద నువ్వా..నేనా..సై అంటూ బరిలో దిగాయి.

అందులో తెలుగు సినిమాల విషయానికి వస్తే.. బాలకృష్ణ(Balakrishna)  భగవంత్ కేసరి(BhagavanthKesari), రవితేజ(Raviteja) టైగర్ నాగేశ్వరరావు(Tiger Nagesawararao), అలాగే కోలీవుడ్ డబ్బింగ్ మూవీగా విజయ్(Vijaythalapathy) లియో(Leo) ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. వీటిలో భగవంత్ కేసరి మూవీ సూపర్ హిట్ టాక్ తో థియేటర్లో రన్ అవుతోంది. మిగిలిన రెండు సినిమాలు మిక్స్డ్ టాక్తో నడుస్తున్నాయి. మొత్తనికి సినిమాలు బాగానే ఉన్న.. ఫ్యాన్స్లో భారీ అంచనాలు ఉండటంతో.. రిచ్ అవ్వలేనందున కాస్తా డిస్సపాయింట్గా ఉన్నారు. అయితే ఈ మూడింటికి పండుగ వసూళ్లు భారీగా వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. 

ఇదిలా ఉంటే..రిలీజైన మూడు సినిమాలు చూసుకుంటే.. ఒక కామన్ పాయింట్తో డైరెక్టర్స్ నడిపించిన విధానం ఆకట్టుకుంటోంది. భగవంత్ కేసరి మూవీలో మనుషుల మధ్య.. పశువాంఛతో తిరిగే మృగాల నుంచి.. తమను తాము రక్షించుకునేలా పేరెంట్స్ ట్రైనింగ్ ఇవ్వాలంటూ.. అలాగే ఈ మూవీలో విలన్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నలుమూలలా విస్తరించుకోవడానికి, నెంబర్ వన్ పొజిషన్లో నిలబడానికి.. కొడుకుని చంపుకునే తండ్రిగా విలన్ రోల్ ని డిజైన్ చేశారు. 

అలాగే టైగర్ నాగేశ్వరావు మూవీలో.. తండ్రి తలని కొడుకు నరికేస్తాడు. ఈ మూడు సన్నివేశాలు యాదృశ్చికంగా దర్శకులు రాసుకున్న కూడా.. కథలో నెగిటివ్ క్యారెక్టర్ ని బలంగా చెప్పడం కోసం చూపించారు. ఈ మూవీలో మెయిన్ స్టోరీ అంత నాగేశ్వరావు చుట్టూనే  తిరుగుతుంది. ఇక లియో మూవీలో విలన్ తన వ్యాపార అభివృద్ధి కోసం కొడుకు, కూతురుని నరబలి ఇవ్వాలని అనుకునే తండ్రిగా సంజయ్ దత్ రోల్ ఉంటుంది. క్రూరంగా.. కర్కశంగా డిజైన్ చేసిన ఈ పాత్రలు చూస్తుంటే..ప్రస్తుత సమాజంలో తిరిగే పిల్లల భవిష్యత్తు ఏంటనేది అర్ధం అవుతుంది. చిన్నప్పుడే పిల్లలను ఫిజికల్ గా, మెంటల్ గా తయారు చేసుకునే బాధ్యత ప్రతి ఒక్క తల్లి తండ్రులది. 

ఇలా దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాలు ఫ్యాన్స్ ను ఎప్పటి నుంచో ఉరిస్తు వస్తున్నవే. అందులోను ఈ మూడు సినిమాలలో ఒక కామన్ పాయింట్ తో తెరకెక్కడం విశేషం. అంతేకాకుండా..ఈ మూడు కథలు కూడా బ్లడ్ అండ్ యాక్షన్ అంశాల చుట్టూనే స్టోరీ నడుస్తుంది. బాలకృష్ణ భగవంత్ కేసరి మూవీలో కాస్తా ఎంటర్టైన్మెంట్ అదనంగా ఉండటంతో..ఆడియన్స్ ఈ మూవీకి ఎక్కువ కనెక్ట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి పండుగ పూర్తయ్యే వరకు దసరా అసలు విన్నర్ ఎవరనేది తెలుస్తోంది.

ALSO READ : ఊరును వెంటాడుతున్న వరుస హత్యలతో మంగళవారం ట్రైలర్‌.. అజయ్కి ఈ సారి హిట్ గ్యారంటీ