ఊరును వెంటాడుతున్న వరుస హత్యలతో మంగళవారం ట్రైలర్‌.. అజయ్కి ఈ సారి హిట్ గ్యారంటీ

ఊరును వెంటాడుతున్న వరుస హత్యలతో మంగళవారం ట్రైలర్‌.. అజయ్కి ఈ సారి హిట్ గ్యారంటీ

ఆర్ఎక్స్100(RX100) మూవీ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaraam). హారర్ అండ్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో..పాయల్ రాజ్ పుత్(Payal Rajput) ప్రధాన పాత్రలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమా నుండి తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేశారు. 

ట్రైలర్‌లో సినిమా స్టోరీ పెద్దగా రివీల్ చేయకుండా కొన్ని సీన్స్‌ను హైలైట్ చేస్తూ డైరెక్టర్ చూపించిన విధానం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్ మొత్తం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో నింపేశాడు దర్శకుడు అజయ్ భూపతి. డైలాగ్స్ ఎక్కువ లేకుండా కేవలం విజువల్స్ తోనే ఆడియన్స్ ను మెప్పించే ప్రయత్నం చేశారు. అలా అనుక్షణం భయపడుతూ బతికే ఒక ఊరి ప్రజలు..మంగళవారం వస్తే చాలు ఆ ఊర్లో ఒక శవం లేస్తుందనే భయాన్ని కలిగించాడు.

Also Read : హిందీ ఇండస్ట్రీ షాక్.. అమీర్ ఖాన్ ముంబై నుంచి వెళ్లిపోతున్నారా?

ఇంతకీ ఆ హత్యలు చేస్తుంది ఎవరు?. అది కూడా మంగళవారమే రాగానే..ఎందుకు హత్యలు చేస్తున్నారు. అలాగే హత్య చేసిన ప్రతిసారి..గోడపైన ఏదో రాసి పెట్టి ఉంచడం..ఇలా ముసుగు వేసుకుని ఊరి ప్రజలను భయపెడుతున్న మనిషి ఎవరు అనే ఎన్నో ప్రశ్నలతో ట్రైలర్‌ కట్ చేసిన తీరు ఆడియన్స్ ను థ్రిల్ కి గురిచేస్తుంది. మంగళవారం ట్రైలర్ చూస్తుంటే.. డైరెక్టర్ అజయ్‌ భూపతి ఈ సారి సరికొత్త కంటెంట్‌తో వస్తున్నట్లు  అర్ధమవుతుంది. 

కాంతార, విరూపాక్ష సినిమాలకు అద్భుతమైన పాటలతో.. అదిరిపోయే రీ రికార్డింగ్ అందించిన అజనీష్ లోక్ నాధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించడం విశేషం. మరోసారి తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ను ఆడియన్స్ కు రుచిచూపించడానికి సిద్దమయ్యాడు అజనీష్. ట్రైలర్ లో కట్ చేసిన విజువల్స్ కు అంజనీష్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. 

ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌,టీజర్ సాంగ్స్ రిలీజ్ అవ్వడంతో..జనాల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు అసలు మంగళవారం ఏం జరిగిందన్న క్యూరియాసిటీ అందరిలోనూ క్రియేట్ అయింది.

డైరెక్టర్ అజయ్ భూపతి గత చిత్రం  మహాసముద్రంతో  బిగెస్ట్ డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మరి మంగళవారం సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతాడా అనేది చూడాలి. ఇక ఈ సినిమా నవంబర్‌ 17న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్‌ కాబోతుంది