హిందీ ఇండస్ట్రీ షాక్.. అమీర్ ఖాన్ ముంబై నుంచి వెళ్లిపోతున్నారా?

హిందీ ఇండస్ట్రీ షాక్.. అమీర్ ఖాన్ ముంబై నుంచి వెళ్లిపోతున్నారా?

ఇండియన్ సినీ ఇండస్ట్రీలో గ్లామర్ నగరం అంటే ముంబై మాత్రమే కనిపిస్తుంది. దాదాపు టాప్ స్టార్ అందరూ ముంబైలోనే  ఉంటున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్(Aamir khan) ఒకరు. దాదాపు 3 దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమిర్. ఈ క్రమంలోనే ఇండియన్ మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే కొంతకాలంగా సారైనా హిట్టులేక రేస్ లో వెనుకపడ్డారు. అయినా కూడా ఆయన క్రేజ్ మాత్రం కొంచం కూడా తగ్గలేదు. ఇప్పటికే ఆయన నుండి ఒక సినిమా వస్తుంది ఆంటీ చాలు ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం. 

ఇదిలా ఉంటే.. ఈ మధ్య సినిమాల కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు ఆమిర్.  తాజాగా ఆయన ముంబై నుండి వెళ్లిపోతున్నారని, చెన్నైకు షిఫ్ట్ అవ్వాలని నిర్ణయించుకున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కవుతూనే.. ఆమిర్ ఖాన్ హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు.

Also Read : మరోసారి రిపీట్ చేస్తున్న నాని.. పండక్కి కొత్త సినిమా అప్డేట్

అయితే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందట. అదేంటంటే.. ఆమిర్‌ ఖాన్‌ తల్లి కొంతకాలంగా చెన్నైలో చికిత్స పొందుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నారట ఆమీర్ కూడా. అందుకే కొన్ని నెలల పాటు చెన్నైలోనే ఉండబోతున్నారట ఆమిర్. తల్లిపై ఆమిర్ కున్న ప్రేమను చూసి ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.