పంజాబ్లో 813 గన్ లైసెన్స్‌లు రద్దు

పంజాబ్లో 813 గన్ లైసెన్స్‌లు రద్దు

పంజాబ్లో  గన్ కల్చర్ పై భగవంత్ మాన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 813 గన్స్కు సంబంధించిన లైసెన్స్ లను రద్దు చేసింది. రాష్ట్రంలో గన్ కల్చర్ విచ్చలవిడిగా పెరిగిపోవడంతో చర్యలు తీసుకుంటున్నట్టుగా అధికారులు తెలిపారు. పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు 2,000 పైగా ఆయుధ లైసెన్స్‌లను రద్దు చేసింది. మరోవైపు అమృత్‌సర్ కమిషనరేట్‌ పరిధిలో 27 మంది, జలంధర్ కమిషనరేట్‌ పరిధిలో 11 మందికి ఇచ్చిన లైసెన్స్ లను కూడా అధికారులు రద్దు చేశారు.

పంజాబ్‌లో మొత్తం 3,73,053 ఆయుధాల లైసెన్స్‌లు ఉన్నాయని,  గన్ కల్చర్ ను పూర్తిగా అంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంటోందని అధికారులు చెప్పారు. గన్‌ల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి తుపాకులు తీసుకు వెళ్లడం, ప్రదర్శించడంపై ప్రస్తుతం నిషేధం ఉందని, రాబోయే రోజుల్లో విస్తృతంగా తుపాకుల తనిఖీలు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.