- కనులపండువగా శ్రీరామనవమి
మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్లో శ్రీరామనవమి వేడుకలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో అత్యంత వైభవంగా జరిగాయి. సీతారాం బాగ్లో భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సీతారాముల కల్యాణం, అనం తరం జరిగిన శోభాయాత్రలో రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన సతీమణితో కలిసి పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వ హించిన గవర్న ర్, శోభాయాత్రను జెండా ఊపి ప్రారంభించారు.
భారతీయ సంస్కృతిలో రామాయణానికి విశిష్ట స్థా నం ఉందని, శ్రీరాముడు ఆదర్శ పుత్రుడిగా, ఆదర్శ భర్తగా, పరిపూర్ణ పురుషుడిగా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిప్రదాత అని గవర్నర్ కొనియాడారు. ఏండ్ల తరబడి సిటీలో శోభాయాత్ర నిర్వహిస్తున్న ఉత్సవ సమితిని ప్రశంసించారు.
ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచిన శోభాయాత్ర..
సీతారాం బాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు సాగిన శోభాయాత్ర భక్తి, ఐకమత్యానికి నిదర్శనంగా నిలిచింది. ప్రత్యేకంగా అలంకరించిన గుర్రపు బండ్లు, సాధు సంతులు, పీఠాధిపతులు, స్వామీజీల భాగస్వామ్యం యాత్రకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చింది. ఈ కార్యక్రమంలో ఉజ్జయినికి చెందిన ఆచార్య స్వామిరాం స్వరూప్ బ్రహ్మచారి మహారాజ్, ఉత్తరాఖండ్ గంగోత్రి ధామ్ నుంచి స్వామి ఆదిత్య ఆనంద్ గిరి మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంతురావు, కార్యదర్శి గోవిందరాఠీ, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 3వేల మందికి పైగా పోలీస్ సిబ్బందిని మోహరించామ వెల్లడించారు.
