మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ ప్రెజెంటేషన్

మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సే ఫ్రెష్‌‌‌‌‌‌‌‌ ప్రెజెంటేషన్

భాగ్యశ్రీ బోర్సే.. రవితేజ హీరోగా హరీష్ శంకర్ రూపొందిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. వీలైనంత త్వరగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు హరీష్. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్టాఫ్  డబ్బింగ్ స్ర్కిస్ట్‌‌‌‌‌‌‌‌ను సిద్ధం చేసినట్టు ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలో పోస్ట్ చేశాడు.

ఈ చిత్రంలో ఆమె ప్రెజెంటేషన్ చాలా ఫ్రెష్‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన మొదటి పాటలో తనదైన లుక్‌‌‌‌‌‌‌‌లో భాగ్యశ్రీ ఇంప్రెస్ చేసింది. ఈ  చిత్రంలో జగపతిబాబు, సచిన్ ఖేడ్కర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.  పనోరమా స్టూడియోస్,  టి సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై  టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.

వివేక్ కూచిభొట్ల కో ప్రొడ్యూసర్. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే తను నటించిన మొదటి సినిమా విడుదల కాకముందే భాగ్యశ్రీ బోర్సేకి వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఆల్రెడీ ఆమె మూడు తెలుగు సినిమాల్లో చాన్స్ దక్కించుకుందని తెలుస్తోంది.