అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక గా జరుపుకునే ‘భాయ్ దూజ్’ పండుగ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో వేడుకగా జరిగింది. మహేశ్ భార్య నమ్రత దగ్గరుండి తన పిల్లల చేత సంప్రదాయ బద్ధం గా ఈ పండుగను నిర్వహించారు. సితార తన అన్న గౌతమ కృష్ణ కు బొట్టు పెట్టి హరతి ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. మహేశ్ అభిమానులు ఈ ఫోటోలు చూసి సంబరపడి పోతున్నారు.
అన్నా చెల్లెళ్ల మధ్య జరిగే ఈ పండుగను మన దగ్గర భగినీ హస్త భోజనం గా చెప్పుకుంటారు. కార్తీక మాసంలో సోదరీ, సోదరులు ఈ వేడుకను జరుపుకుంటారు.




