17న జింఖానాలో భైచుంగ్ ఫుట్‌‌బాల్ అకాడమీ  ట్రయల్స్

17న జింఖానాలో భైచుంగ్ ఫుట్‌‌బాల్ అకాడమీ  ట్రయల్స్

హైదరాబాద్, వెలుగు :  దేశంలో ఫుట్‌‌బాల్‌‌ను అభివృద్ధి చేసేందుకు, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు  ఇండియా ఫుట్‌‌బాల్ లెజెండ్ భైచుంగ్ భూటియా నడుం బిగించాడు. 'బిల్డింగ్ ఫ్యూచర్ చాంపియన్స్' అనే నినాదంతో భైచుంగ్ భూటియా  ఫుట్‌‌బాల్ స్కూల్స్ (బీబీఎఫ్‌‌ఎస్)ను ప్రారంభించాడు.  చండీగఢ్​లో బీబీఎఫ్‌‌ఎస్‌‌  రెసిడెన్షియల్‌‌ అకాడమీలో కోచింగ్ ప్రోగ్రామ్‌‌ కోసం కోసం దేశ వ్యాప్తంగా ట్రయల్స్‌‌ను ఏర్పాటు చేశాడు.

ఇందులో భాగంగా  ఈ నెల 17న హైదరాబాద్‌‌లోని జింఖానా గ్రౌండ్‌‌లో ట్రయల్స్ జరగనున్నాయి.  2007 జనవరి 1–2014 డిసెంబర్ 31  మధ్య జన్మించిన క్రీడాకారులు ట్రయల్స్‌‌లో పాల్గొనేందుకు అర్హులని నిర్వాహకులు తెలిపారు. ట్రయల్స్‌‌కు వచ్చే ప్లేయర్లు  సొంత కిట్‌‌, ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని,  ఎంజోగో యాప్‌‌లో పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని వెల్లడించారు. వివరాల కోసం 8448020010 నంబర్‌‌‌‌ను సంప్రదించాలని సూచించారు.