మళ్లీ థియేటర్స్​కు భైరవద్వీపం..ఈసారి మరింత కొత్తగా

 మళ్లీ థియేటర్స్​కు  భైరవద్వీపం..ఈసారి మరింత కొత్తగా

ఇటీవల కొత్త చిత్రాలతో పాటు రీ రిలీజ్‌‌ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. స్టార్ హీరోలు నటించిన హిట్ సినిమాలను 4కే క్వాలిటీతో మళ్లీ విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ నటించిన ‘నరసింహనాయుడు’ సినిమాను రీసెంట్‌‌గా రిలీజ్ చేయగా మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీంతో బాలకృష్ణ నటించిన ఆల్ టైమ్ ఫాంటసీ క్లాసిక్ ‘భైరవద్వీపం’ చిత్రాన్ని కూడా రీ రిలీజ్ చేయనున్నట్టు మంగళవారం ప్రకటించారు.

ALSO READ :మేక్‌‌ ఏ విష్..ఇది ముగ్గురు స్త్రీల కథ

ఆగస్టు 5న 4కే క్వాలిటీతో విడుదల చేస్తున్నట్టు క్లాప్స్ ఇన్ఫోటైన్‌‌మెంట్ సంస్థకు చెందిన చంద్రశేఖర్ కుమారస్వామి తెలియజేశారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో  ముప్ఫై ఏళ్ల క్రితం వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ప్రభంజనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో పాటు 9 నంది అవార్డులను గెలుచుకుంది. రావి కొండల రావు కథను అందించగా.. మాధవపెద్ది సురేష్ అందించిన సంగీతం సినిమాకు మరో హైలైట్