
కిరణ్ కస్తూరి నిర్మాతగా సంధ్య బయిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మేక్ ఎ విష్’. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంగళవారం నిర్మాతలు రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్ రిలీజ్ చేసి టీమ్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు. ‘ఇది ముగ్గురు స్త్రీల కథ. వారి ప్రేమ కథలతో పాటు వారి రిలేషన్స్, ప్రాబ్లమ్స్ చుట్టూ తిరుగుతుంది.
ALSO READ :మళ్లీ థియేటర్స్‌కు భైరవద్వీపం..ఈసారి మరింత కొత్తగా
కథ మొత్తం వారి జీవితంలోకి చొరబడిన వ్యక్తితో టైమ్‌లైన్‌లో ముందుకు వెనుకకు తిరుగుతుంది. వాషింగ్టన్ డీసీ, యుఎస్‌ఎ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది’ అని దర్శకనిర్మాతలు చెప్పారు.