భైరవకోన వెరీ స్పెషల్

భైరవకోన వెరీ స్పెషల్

 సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా  వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు.  ఫిబ్రవరి 16న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఆదివారం మూవీ టీమ్ ప్రెస్‌‌‌‌ మీట్ నిర్వహించింది. సందీప్ కిషన్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం కోసం  దాదాపు రెండున్నరేళ్ళ పాటు కష్టపడ్డాం. వీఐ ఆనంద్ చాలా హార్డ్ వర్క్ చేశారు.  ఇది వెరీ స్పెషల్ మూవీ. ఫాంటసీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ ఉన్న కమర్షియల్ తెలుగు సినిమా. దీనిపై చాలా నమ్మకంగా ఉన్నాం’ అని  చెప్పాడు. 

ఇందులో తాను ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశానని చెప్పింది వర్ష బొల్లమ్మ. వీఐ ఆనంద్ మాట్లాడుతూ ‘ఇదొక అద్భుతమైన జర్నీ. ప్రతి మూమెంట్ మాకు ఓ కొత్త అనుభవం.  ఇదొక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్, సూపర్ నేచురల్ ఫాంటసీ, మంచి లవ్ స్టొరీ కూడా ఉంది. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు’ అని చెప్పారు. ‘అవుట్‌‌‌‌పుట్ చాలా బాగా వచ్చింది. ఈ సినిమాతో సందీప్ నెక్స్ట్ రేంజ్‌‌‌‌కి వెళ్తాడు’ అని నిర్మాతలు అన్నారు. నటుడు హర్ష, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.