డిసెంబర్ 3న రాజస్థాన్లోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర

 డిసెంబర్ 3న రాజస్థాన్లోకి ప్రవేశించనున్న రాహుల్ యాత్ర

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర డిసెంబర్ 3న రాజస్థాన్ లోకి ప్రవేశిస్తుందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా తెలిపారు. ఈ యాత్ర రాష్ట్రంలోని పలు జిల్లాల మీదుగా సాగుతుందని తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటారని చెప్పారు.

 

రాజస్థాన్ లో రాహుల్ యాత్ర 18 నుంచి 21 రోజులపాటు సాగనుందని విభాకర్ శాస్త్రి తెలిపారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్ ప్రచారం చేయనున్న నేపథ్యంలో షెడ్యూల్ లో మార్పులు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ కు వస్తున్న స్పందన చూసి కొందరు కావాలనే విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మరో యాత్ర చేపట్టే అవకాశం ఉందని శాస్త్రి చెప్పారు.