
న్యూఢిల్లీ: శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడా ఇంధనాన్ని కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే శ్రీలంకకు చెందిన విమానాలకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీవోసీ) ఫ్యూయెల్ అందజేసింది. తమిళనాడులోని చెన్నై, త్రివేండ్రం, కొచ్చి ఎయిర్పోర్టులలో గడిచిన 15 రోజులలో 100 శ్రీలంక విమానాలకు రీఫ్యూయెల్ చేసినట్లు భారత్ పెట్రోలియం శుక్రవారం ప్రకటించింది. శీలంక విమానంలో ఫ్యూయెల్ నింపుతున్న ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది. ‘‘ఎక్కువదూరం ప్రయాణించే శ్రీలంక ఎయిర్‌లైన్స్‌కు ఫ్యూయెల్ అందజేయడంలో మద్దతును కొనసాగిస్తాం. రీ ఫ్యూయెలింగ్లో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌తో పదేండ్లకు పైగా అనుబంధం ఉంది” అని భారత్ పెట్రోలియం పేర్కొంది.