రవితేజ మార్క్‌‌ ఫన్‌‌ తో..భర్త మహాశయులకు విజ్ఞప్తి

రవితేజ మార్క్‌‌ ఫన్‌‌ తో..భర్త మహాశయులకు విజ్ఞప్తి

సంక్రాంతికి రవితేజ నుంచి వస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్స్‌‌. సోమవారం ట్రైలర్‌‌‌‌ అప్‌‌డేట్‌‌ ఇచ్చారు మేకర్స్‌‌.  బుధవారం థియేట్రికల్ ట్రైలర్‌‌‌‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌లో ఓవైపు ఇల్లాలు, మరోవైపు ప్రియురాలు మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపించారు. 

అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్‌‌ లక్ష్యంగా ఈ సినిమా రాబోతోందని క్లారిటీ ఇచ్చారు.  దీంతో రాబోయే ట్రైలర్‌‌‌‌పై ఆసక్తి నెలకొంది. రవితేజ గారి మార్క్ ఎనర్జీ, కామెడీ టైమింగ్‌‌తో ఆడియెన్స్‌‌ను హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌‌‌‌టైన్ చేసేలా సినిమా ఉంటుందని మేకర్స్‌‌ చెబుతున్నారు.   భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.  భోగి పండుగ కానుకగా జనవరి 13న సినిమా థియేటర్స్‌‌కి వస్తోంది.