ఎయిర్టెల్లో నెల రోజుల వ్యాలిడిటీతో ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..

ఎయిర్టెల్లో నెల రోజుల వ్యాలిడిటీతో ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే..

టెలికాం దిగ్గజ కంపెనీల్లో ఒకటైన ఎయిర్టెల్ కస్టమర్లకు పలు మంత్లీ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. 30 రోజుల వ్యాలిడిటీతో ఎయిర్ టెల్లో మూడు పాపులర్ రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. 219, 355, 589 రూపాయల రీఛార్జ్ ప్లాన్స్ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు బడ్జెట్ ఫ్రెండ్లీలో అందుబాటులో ఉన్నాయి. 219 రూపాయల ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే 3 జీబీ 4జీ డేటాతో పాటు 300 ఎస్ఎంఎస్లు చేసుకునే వెసులుబాటు ఉంది. అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీ 30 రోజులు. యూజర్లకు 5 రూపాయల టాక్ టైం బ్యాలెన్స్ ను కూడా ఎయిర్ టెల్ ఈ 219 రూపాయల ప్లాన్ తో పాటుగా అందిస్తోంది. ఫ్రీ హలో ట్యూన్స్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీం యాప్లో కంటెంట్ను ఉచితంగా 30 రోజుల పాటు వీక్షించవచ్చు.

ఇక.. 355 రూపాయల ప్లాన్ విషయానికొస్తే.. నెలకు 25 జీబీ డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్. రోజుకు 100 ఎస్ఎంఎస్లు చేసుకునే అవకాశం. ఈ ప్లాన్ వ్యాలిడిటీ కూడా 30 రోజులు. ఫ్రీ హలో ట్యూన్స్, ఎయిర్ టెల్ ఎక్స్ స్ట్రీం యాప్లో ఫ్రీ కంటెంట్తో పాటు అపోలో 24/7 సర్కిల్ సేవలు కూడా ఈ రీఛార్జ్ ప్లాన్తో పొందొచ్చు. 589 రూపాయల ప్రీపెయిడ్ మంత్లీ ప్లాన్ కూడా ఎయిర్ టెల్ లో అందుబాటులో ఉంది. నెలకు 50 జీబీ డేటా, రోజుకు 300 ఎస్ఎంఎస్లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్. 30 రోజుల సర్వీస్ వ్యాలిడిటీ. ఫ్రీ హలో ట్యూన్స్, ఎక్స్ స్ట్రీం ప్లే, అపోలో 24/7 సర్కిల్ సేవలు ఈ ప్లాన్తో పాటు పొందొచ్చు.

భారతీ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ ప్రీపెయిడ్,  పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పెయిడ్ మొబైల్ టారిఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను 10-–21 శాతం పెంచిన సంగతి తెలిసిందే.  మన దేశంలోని టెల్కోలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ...మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్​పీయూ) రూ. 300 కంటే ఎక్కువగా ఉండాలని ఎయిర్ టెల్ ఈ టారిఫ్ల పెంపును సమర్థించుకుంది. నెలకు ఒక్కో యూజర్​నుంచి వచ్చే ఆదాయాన్ని ఏఆర్​పీయూ అంటారు. ధరల పెంపుతో వచ్చే డబ్బును టెక్నాలజీ, పెట్టుబడుల కోసం వాడతామని ఎయిర్ టెల్ కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే భారతదేశంలోనే టారిఫ్లు తక్కువగా ఉన్నాయని పేర్కొంది.