సిరిసిల్ల టౌన్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ వల్ల మాలలకు తీవ్ర నష్టం జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. శనివారం ఆయన రాజన్న సిరిసిల్లలో పర్యటించి మీడియాతో మాట్లాడారు. కులాల వారీగా సరైన డేటా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసిందని ఆరోపించారు.
జీవో 99ను సవరించి మాలలతో పాటు 25 ఉపకులాలకు న్యాయం చేయాలన్నారు. ఈ నెల 23న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘హలో మాల చలో ఢిల్లీ’ రణ భేరికి మాలలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. అనంతరం సభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుల వేంకటేశ్వర్లు, రాగుల రాములు తదితులు పాల్గొన్నారు.
