భారతీ ఎయిర్‌టెల్​ కు రూ.2,145 కోట్ల లాభం

భారతీ ఎయిర్‌టెల్​ కు రూ.2,145 కోట్ల లాభం

న్యూఢిల్లీ: భారతదేశపు రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన భారతీ ఎయిర్‌టెల్​కు ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన రెండవ క్వార్టర్​లో రూ.2,145 కోట్ల లాభం వచ్చింది.  ఏడాది క్రితం ప్రకటించిన  రూ. 1,134 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 89 శాతం పెరిగింది. డేటా ట్రాఫిక్‌లో బలమైన వృద్ధి కనిపించింది. ఎనలిస్టుల అంచనాల ప్రకారమే లాభం వచ్చింది. 

రిపోర్టింగ్​ క్వార్టర్​లో మొత్తం ఆదాయం రూ. 34,526.8 కోట్లుగా ఉంది, పోయిన ఏడాది ఇదే క్వార్టర్​లో నమోదైన రూ. 28,326.4 కోట్లతో పోలిస్తే ఇది 22 శాతం ఎక్కువ.  నికర లాభంలో సంవత్సరానికి 75 నుంచి 110 శాతం వరకు గ్రోత్​ ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. అయితే ఆదాయ వృద్ధి 20 శాతమే ఉంది. కన్సాలిడేటెడ్​​ ప్రాతిపదికన 16 దేశాలలో వాయిస్ ట్రాఫిక్ 5.1 శాతం పెరిగింది.