- ఎన్బీఎఫ్సీ విస్తరణకు రూ.20 వేల కోట్లు..
- ఎయిర్‌టెల్ ప్రకటన
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్ తన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఎయిర్‌టెల్ మనీ విస్తరణకు భారీ ప్రణాళికలు ప్రకటించింది. రాబోయే కొన్నేళ్లలో ఈ అనుబంధ సంస్థకు రూ.20 వేల కోట్ల మూలధనాన్ని సమకూర్చనున్నట్లు వెల్లడించింది. ఇందులో ఎయిర్‌టెల్ 70 శాతం వాటా అందించగా, మిగిలిన 30 శాతం మొత్తాన్ని భారతీ ఎంటర్‌ప్రైజెస్ సమకూరుస్తుంది.
ఈనెల 13న ఆర్బీఐ నుంచి ఎన్బీఎఫ్సీ లైసెన్స్ పొందినట్లు సంస్థ తెలిపింది. దేశంలో రుణ అంతరాన్ని తగ్గించే లక్ష్యంతో డిజిటల్ ఆర్థిక సేవలను వేగంగా విస్తరించాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ తన లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎల్ఎస్పీ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.తొమ్మిది వేల కోట్ల విలువైన లోన్లను ఇచ్చినట్టు తెలిపింది.
