
- 10 లక్షల యూజర్ల మార్క్ దాటేసింది
- ఎక్స్‌ట్రా ఛార్జీలు లేవు
న్యూఢిల్లీ : ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సర్వీసు 10 లక్షల యూజర్లను క్రాస్ చేసింది. వాయిస్ ఓవర్ వైఫై సేవలు ప్రారంభించిన నెలలోనే, ఈ మార్క్‌ను ఎయిర్‌టెల్ సాధించింది. ఏ వైఫై నెట్‌వర్క్ ద్వారానైనా వైఫై కాలింగ్ సర్వీసును వాడుకునే అవకాశాన్ని తన మొబైల్ కస్టమర్లకు ఎయిర్‌టెల్ కల్పిస్తోంది. ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ ద్వారా చేసుకునే కాల్స్‌కు కంపెనీ ఎలాంటి ఎక్స్‌ట్రా ఛార్జీలను వేయడం లేదు. కస్టమర్ల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చాక, కంపెనీ ఈ ఇన్నోవేటివ్ సర్వీసులను దేశమంతటా అమలు చేసింది. ఇంట్లో ఉన్న వైఫై లేదా పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ ద్వారానైనా ఎయిర్‌టెల్ మొబైల్ కస్టమర్లు ఈ సేవలను పొందవచ్చు. 100కు పైగా స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సౌకర్యానికి అనువుగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. ఈ వారం మొదట్లో రిలయన్స్ జియో కూడా వైఫై సర్వీసులపై వాయిస్, వీడియో కాలింగ్ సౌకర్యాన్ని లాంచ్ చేసింది. జియో వైఫై కాలింగ్ సేవలు, వైఫై నెట్‌వర్క్‌పై వీడియో కాల్స్ చేసుకునేందుకు కూడా అనుమతి ఇస్తున్నాయి.