తగ్గిన సైయెంట్ లాభం.. జూన్క్వార్టర్లో రూ.7.5 కోట్లు

తగ్గిన సైయెంట్ లాభం.. జూన్క్వార్టర్లో రూ.7.5 కోట్లు

న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, టెక్నాలజీ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్​ కంపెనీ సైయెంట్ ఈ ఏడాది జూన్​తో ముగిసిన మొదటి క్వార్టర్​ఫలితాలను విడుదల చేసింది. ఈసారి కంపెనీ ఆదాయం 8శాతం పెరిగి రూ.278.4 కోట్లకు చేరింది. నికర లాభం 29.6శాతం తగ్గి కేవలం రూ.7.5 కోట్లుగా నమోదైంది. 

ఈ తగ్గుదలకు కొన్ని నాన్–-ఆపరేషనల్ అంశాలు కారణమని కంపెనీ వెల్లడించింది. ఇబిటా 25.3శాతం వృద్ధితో రూ.25.1 కోట్లకు చేరింది. ఆర్డర్ బ్యాక్‌‌లాగ్ రికార్డు స్థాయిలో రూ.2,131.8 కోట్లకు చేరుకుంది. ఇది 2026 ఆర్థిక సంవత్సరంలో బలమైన ఆదాయ వృద్ధికి దోహదపడనుందని కంపెనీ తెలిపింది.