
న్యూఢిల్లీ : ఎయిర్‌టెల్ ప్రమోటర్ సంస్థయిన భారతీ టెలికాం, విదేశీ సంస్థల నుంచి రూ. 4,900 కోట్లను సమీకరించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ దేశీయ సంస్థలో సింగపూర్సంస్థ సింగ్‌టెల్, ఇతర విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా ప్రస్తుతం భారతీ టెలికాంలో సునిల్ భారతీమిట్టల్, ఆయనకుటుంబానికి 52 శాతం వాటా ఉంది. ఈ సమీకరణ పూర్తయితే భారతీ టెలికాం సంస్థ విదేశీ సంస్థగా మారుతుంది. ప్రస్తుతం భారతీ టెలికాం సంస్థకు భారతీ ఎయిర్‌టెల్‌లో 41 శాతం వాటా ఉండగా, విదేశీ ప్రమోటర్లు 21.46 శాతం వాటాను కలిగివున్నారు. 37 శాతం వాటా పబ్లిక్ హోల్డింగ్‌లో ఉంది. ఈ సమీకరణ ఫలిస్తే భారతీ ఎయిర్‌టెల్‌లో విదేశీ ఇన్వెస్టర్ల షేర్‌హోల్డింగ్ 84 శాతాన్ని దాటుతుంది.