బీఆర్ఎస్ పాలనపై తీవ్ర నిరాశలో జనం: భట్టి విక్రమార్క 

బీఆర్ఎస్ పాలనపై తీవ్ర నిరాశలో జనం: భట్టి విక్రమార్క 

లింగాల, వెలుగు: తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకల ఆనందం ప్రజల్లో కనిపించడం లేదని, బీఆర్ఎస్ పాలన బాగుంటే స్వచ్ఛందంగా వారే ముందుకొచ్చి పాల్గొనేవారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 77వ రోజు  గురువారం నాగర్​కర్నూల్​ జిల్లా లింగాల మండలంలో  కొనసాగింది.

ఈసందర్భంగా ఆయన అవుసలికుంట గ్రామంలో మీడియాతో మాట్లాడుతూ..బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల బతుకులకు భవిష్యత్తు లేకుండా చేసి పండుగ చేసుకోమంటే ఎట్లా చేసుకుంటారని విమర్శించారు. కేసీఆర్​ పాలనలో దగా పడిన ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. ఎన్నికలొచ్చినప్పుడే బర్లు, గొర్లు, ప్రాజెక్టులు గుర్తుకొస్తాయన్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను సోనియాగాంధీకి కృతజ్ఞతా దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, పార్టీ రాష్ట్ర నాయకుడు శ్రీనివాసరావు, మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.