కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కరోనాను వెంటనే ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ఇదే విషయంపై సీతక్క, వెంకట్ ల నిరాహార దీక్షపై ప్రభుత్వం వెంటనే స్పదించాలన్నారు. ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన.. కరోనాతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని..కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా దొరకడం లేదని విమర్శించారు. అంతేకాదు ఆక్సిజన్, మెడిసిన్స్ కూడా అందుబాటులో లేవన్నారు. రెమ్ డెసివిర్ మెడిసిన్ కొరత తీవ్రంగా ఉందన్నారు.

బెడ్స్, మందులు, రెమ్ డెసివిర్ కొరత పేరుతో ధరలును విపరీతంగా పెంచుతున్నారని అన్నారు భట్టి. వీటిని తట్టుకోవడం సామాన్యుల వల్ల కావడం లేదన్నారు. బ్లాక్ మార్కెట్ కు తరలుతున్న రెమ్ డెసివిర్ ఇంజక్షన్ పై తక్షణం ప్రభుత్వం చర్యలు తీసుకుని.. తక్కువ ధరకే కరోనా బాధితులకు అందించాలన్నారు.