కరెంట్ ఉందో లేదో.. వైర్లను పట్టుకుని చూడండి: భట్టి

కరెంట్ ఉందో లేదో.. వైర్లను పట్టుకుని చూడండి: భట్టి

కరెంటుపై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కరెంట్ ఇవ్వడం లేదన్న వాళ్లు కరెంట్ తీగలు పట్టుకుని చూడాలన్నారు.  చేవేళ్ల సభలో మాట్లాడిన ఆయన... కాళేశ్వరం అద్భుతమన్నారు.. ఇవాళ కుప్పకూలి దేనికి పనికి రాకుండా పోయే పరిస్థితి వచ్చిందన్నారు. కాళేశ్వరం పనికిరాదని నిపుణులు చెబుతున్నారన్నారు. లక్షల కోట్లను  గోదావరిలో పోశారని మండిపడ్డారు.

ప్రీ కరెంట్, గ్యాస్ సిలిండర్ హామీలు ప్రారంభించిన ఈ రోజు చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించాల్సిన రోజుగా వర్ణించారు భట్టి విక్రమార్క. మహాలక్ష్మిగా మహిళలను గౌరవిస్తున్నామని చెప్పారు. అందుకే  ఫస్ట్ హామీ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీని రూ. 10లక్షలకు పెంచాం.. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులున్నా హామీలు అమలు చేస్తున్నామన్నారు.  వచ్చిన ఆదాయం బీఆర్ఎస్ చేసిన అప్పులు కట్టాల్సి వస్తోందని తెలిపారు.  ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ చేతిలో పెడితే విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.  మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దేనన్నారు.