భట్టి విక్రమార్క అనే నేను.. బాండ్ రాసి.. దేవుడి ఎదుట ప్రమాణం

భట్టి విక్రమార్క అనే నేను.. బాండ్ రాసి.. దేవుడి ఎదుట ప్రమాణం

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, సీఎల్పీ నేత అయిన భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓటర్లకు పార్టీ తరపునే కాకుండా వ్యక్తిగతంగా హామీ, భరోసా ఇస్తున్నారు. 100 రూపాయల బాండ్ పేపర్ పై ప్రజలకు చేసే సేవ గురించి రాసి ఇచ్చారు. అంతేనా గుడిలో ప్రమాణం చేశారు. అక్కడే బాండ్ పేపర్ పై దేవుడి ఎదుట సంతకం చేశారు.

భట్టి విక్రమార్క అనే నేను ఎమ్మెల్యేగా గెలవటమే కాదు.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తానని.. అందరికీ న్యాయం చేస్తానని.. అన్ని సమస్యలను పరిష్కరిస్తానని.. సంక్షేమ పథకాలు అర్హులు అందరికీ ఇస్తానని.. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉంటానండీ బాండ్ పేపర్ రాసిచ్చారు. నోటి మాట ద్వారా ఇచ్చేది కాదని.. అఫిడవిట్ రూపంలో హామీ ఇస్తూ.. ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. 

భట్టి విక్రమార్క అఫిడవిట్ హామీతోపాటు ప్రమాణం చేయటం సంచలనంగా మారింది. మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం అవుతున్న సమయంలో.. నియోజకవర్గ ప్రజలకు భట్టి విక్రమార్క చేసిన ప్రమాణం, రాసిన బాండ్ పేపర్ ఆసక్తిగా మారింది.