అచ్చంపేటలో మహిళా శక్తి సంబురాలు .. హాజరుకానున్న మంత్రులు సీతక్క, సురేఖ, కృష్ణారావు

అచ్చంపేటలో మహిళా శక్తి సంబురాలు .. హాజరుకానున్న మంత్రులు సీతక్క, సురేఖ, కృష్ణారావు

అచ్చంపేట, వెలుగు: అచ్చంపేటలో సోమవారం ఇందిరా మహిళా శక్తి సంబురాలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎక్సైజ్​శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా కమిషన్ చైర్​పర్సన్ నేరెళ్ల శారద హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. 

స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాట్లను ఆదివారం పరిశీలించారు. మహిళల అభివృద్ధితోనే కుటుంబాల అభివృద్ధి సాధ్యమన్న భావనతో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రామనాథం, నాయకులు మహబూబ్ అలీ, పాండు తదితరులు పాల్గొన్నారు.