
నర్వ, వెలుగు: బాల్కొండ నియోజకవర్గంలో గల్ఫ్ మృతులపై చర్చకు సిద్ధమా అనే కార్యక్రమానికి వెళ్లిన ఎన్ఆర్ఐ నంగి దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల దాడిలో గాయపడ్డారు. ఆదివారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మరికల్మండలం జిన్నారంలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
కాంగ్రెస్ నర్వ మండల అధ్యక్షుడు చెన్నయ్య సాగర్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శేఖర్‌రెడ్డి తదితరులున్నారు.