యూపీఏ ముందుచూపుతోనే తెలంగాణకు కరెంటు : భట్టి విక్రమార్క

యూపీఏ ముందుచూపుతోనే తెలంగాణకు కరెంటు : భట్టి విక్రమార్క

తెలంగాణ శాసనసభలో విద్యుత్ అంశంపై చర్చ సాగింది. ప్రతిపక్ష సభ్యులు, అధికార పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో విద్యుత్ శాఖపై చేసిన అప్పులపై ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేశారు. వాస్తవాలను తెలియాలని విద్యుత్ అప్పులపై శ్వేతపత్రం రిలీజ్ చేశామన్నారు భట్టి విక్రమార్క. ప్రతిపక్ష సభ్యులందరూ ఇచ్చిన అనుభవాలను, సలహాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు.

కరెంటు మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినట్లు ఆ పార్టీ సభ్యులు క్రియేట్ చేసినట్లు చెప్పారని అన్నారు. నిజాలు దాస్తే దాగవన్నారు. విద్యుత్ ఒక్కరోజులేనే తయారు చేసేది కాదని చెప్పారు. అనాడు తాము పునాది వేసిన ప్రాజెక్టులే తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు తెలంగాణలో కరెంటు లేదా..? అని ప్రశ్నించారు. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభిస్తే.. అది పూర్తవడానికి దాదాపు నాలుగైదేండ్ల సమయం పడుతుందన్నారు.

కరెంటుపై భట్టి వివరణ : 

ప్రాజెక్టు ప్రారంభిస్తే పూర్తవడానికి నాలుగైదేండ్ల సమయం పడుతుంది

బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు తెలంగాణలో కరెంటు లేదా...?

యూపీఏ ముందుచూపుతోనే తెలంగాణకు కరెంటు

రాష్ట్రంలో ఉన్న డిమాండ్ కంటే 2.7శాతం ఎక్కువే విద్యుత్ ఇచ్చాం

విద్యుత్ అనేది ఒక్కరోజులో తయారు చేసేది కాదు

కరెంటు మొత్తం మేము ఇచ్చామని చెప్పుకుంటే ఎట్లా..?

రెండు దశాబ్దాల క్రితమే అనేక సంస్కరణలు తెచ్చాం

యూపీఏ ముందుచూపు వల్లే నేడు దేశంలో కరెంటు 

విద్యుత్ కొనుగోళ్లు, అమ్మకాల మార్కెట్ సృష్టించిందే మేము

రాష్ట్రం రాక ముందు 5661 మెగావాట్ల విద్యుత్ డిమాండ్

2 వేలకు పైగా మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు వేశాం

రాష్ట్రం రాకముందు 1638 మెగావాట్లను రాష్ట్రానికి అందించాం

38 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేశారా..?

బొగ్గు దొరికే చోట విద్యుత్ ప్లాంట్లు ఎందుకు పెట్టలేదు...?

బొగ్గు దొరకని చోట విద్యుత్ ప్లాంట్లు  ఏర్పాటు చేశారు

38 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి గత ప్రభుత్వం ప్లాన్ చేసింది....?

డిమాండ్ కు తగినట్లు విద్యుత్ ఉత్పత్తిని బీఆర్ఎస్ చేసిందా...?

బీఆర్ఎస్ వచ్చాక యాదాద్రి, భద్రాద్రి, ప్లాంట్లు తప్ప ఏం చేశారు..?

యాదాద్రిపై దాదాపు 10 వేల కోట్ల భారం పెరిగింది

ఛత్తీస్ గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలును హడావుడి చేశారు

గత ప్రభుత్వం లక్షా 57 వేల కోట్ల భారం మోపింది

హైదరాబాద్ కు గండిపేట, మంజీరా, కృష్ణా నీళ్లు తెచ్చింది కాంగ్రెస్సే

హైదరాబాద్ లో ఒక్క డ్యామ్ అయినా బీఆర్ఎస్ కట్టిందా..?

కాలువల నుంచి నీరు వస్తుంటే రైతులు బోర్లు ఎందుకు వేసుకుంటారు

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు రాలేదు.. నిధులు వృథా అయ్యాయి..

వ్యవసాయంలో విద్యుత్ వినియోగం పెరిగింది

అప్పుల భారం చూస్తే భయం అవుతోంది 

10 ఏళ్లలో బీఆర్ఎస్ ఉత్పత్తి చేసింది వెయ్యి మెగావాట్లే

విద్యుత్ సంస్థలకు లక్ష కోట్లకు పైగా అప్పులు

శ్వేతపత్రంతో విద్యుత్ పై నిజాలు ప్రజలకు చెబుతున్నాం

జీవితంలో 24 గంటల కరెంటు ఎప్పుడూ బీఆర్ఎస్ ఇవ్వలేదు

కరెంటు కావాలా..? కాంగ్రెస్ కావాలా..? అని బీఆర్ఎస్ ప్రచారం చేసింది

కరెంటు కావాలి.. కాంగ్రెస్ కావాలి అని ప్రజలు తీర్పు చెప్పారు

ఓల్డ్ సిటీలో సమస్యలు పరిష్కరిస్తాం

మాకు ఓల్డ్ సిటీ అయినా, న్యూ సిటీ అయినా ఒక్కటే

రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందిస్తాం

శ్వేతపత్రంలో చెప్పిన విషయాలన్నీ వాస్తవం