బీహెచ్ఈఎల్ ఈడీ రాజా పదవీ విరమణ

బీహెచ్ఈఎల్ ఈడీ రాజా పదవీ విరమణ

రామచంద్రాపురం, వెలుగు: భారత్ హెవీ ఎలక్ర్టిల్​ లిమిటెడ్​ రామచంద్రాపురం యూనిట్ హెచ్​పీఈపీ ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్ కేబీ రాజా సోమవారం పదవీ విరమణ పొందారు. 37 ఏళ్ల పాటు భెల్​కు సుదీర్ఘ సేవలందించిన ఆయన ఎక్కడ ఉద్యోగం ప్రారంభించారో అక్కడే రిటైర్డ్ అయ్యారు. 2017 లో జీఎంగా పదోన్నతి పొందిన రాజా తర్వాత ఢిల్లీలో జాయింట్ ఎండీగా పదోన్నతి సాధించారు. గ్యాస్​ టర్బైన్​ ఇంజినీరింగ్ హెడ్​గా బాధ్యతలు చేపట్టిన సమయంలో రక్షణ, వైమానిక రంగాల్లో విభిన్నీకరణ, ఉక్రెయిన్​ జోర్యా, నెదర్లాండ్స్ ఓప్రా సంస్థల ఒప్పందంలో కీలక పాత్ర పోషించారు. 

సోమవారం కేబీ రాజాకు భెల్​ అధికారులు, ఉద్యోగులు వీడ్కోలు పలికారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించారు. కేబీ రాజా పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో పీఈఎస్​డీ ఈడీ శ్రీనివాస రావుకి హెచ్​పీఈపీ ఈడీ అదనపు బాధ్యతలు అప్పగించారు. యూనిట్ అభివృద్ధి, పురోగతికి తన వంతు కృషి చేస్తానని, భెల్​ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లి ఉద్యోగులతో కలిసి మెలిసి పని చేసేందుకు కట్టుబడి ఉన్నానని శ్రీనివాస రావు తెలిపారు.