- పోలీసులకు జర్నలిస్టుల ఫిర్యాదు
జైపూర్(భీమారం), వెలుగు: మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని బూరుగుపల్లి నుంచి దాంపూర్ వెళ్లే రోడ్డు రిపేర్లకు టెండర్ వేసిన కాంట్రాక్టర్ రామారావుపై భీమారం జర్నలిస్టులు బుధవారం ఎస్సై శ్వేతకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులు మాట్లాడుతూ.. కొద్దిరోజుల క్రితం కురిసిన వర్షాలకు రోడ్డు కొట్టుకుపోగా కొత్త రోడ్డు వేసేందుకు రామారావు కాంట్రాక్ట్ తీసుకున్నాడు.
పనులు ఇంకా చేపట్టలేదు. ఈ క్రమంలోనే రోడ్డు పరిస్థితిపై పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని సదరు కాంట్రాక్టర్ జర్నలిస్టులను, పత్రికల ను కించపరిచేలా మాడ్లాడారు.
ఆ మాటలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. జర్నలిస్టులు వేముల భగవాన్ దాస్, కలగూర ప్రవీణ్ కుమార్, నరహరి సంపత్ రెడ్డి, మేడిపల్లి సతీశ్, తైదల రాజన్న, ప్రవీణ్ ఉన్నారు.
