వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ భీమేశ్వరాలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు క్యూలెన్లలో వేచివుండి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈఈ రాజేశ్, ఏఈవోలు శ్రీనివాస్, శ్రవణ్ కుమార్, అశోక్ కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, రాజేందర్ తదితరులున్నారు.
కోడెమొక్కు చెల్లించుకున్న ఎన్నికల అబ్జర్వర్లు
భీమేశ్వరుని ఆలయంలో సిద్దిపేట ఎన్నికల అబ్జర్వర్ హరిత, జగిత్యాల ఎన్నికల అబ్జర్వర్ రమేశ్ ఆదివారం పూజలు చేశారు. అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభం
వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. నాగిరెడ్డి మండపంలో గీతా పారాయణం జరిపారు. మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయని అధికారులు తెలిపారు.
