
చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న మాస్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిరంజీవికి జంటగా తమన్నా నటిస్తుండగా, చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇటీవలే ‘భోళా మేనియా’ అనే పాటను విడుదల చేసిన టీమ్, మరో సాంగ్ షూటింగ్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ఓ డాన్స్ నెంబర్‌ని షూట్ చేస్తున్నారు.
చిరంజీవితో పాటు తమన్నా, కీర్తి సురేష్ , ఇతర నటీనటులందరూ ఈ షూట్‌లో పాల్గొంటున్నారు. మహతి స్వరసాగర్ అందించిన ఎనర్జిటిక్ సాంగ్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్, రఘు బాబు, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, తులసి, సురేఖా వాణి, శ్రీముఖి, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, తరుణ్ అరోరా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. తిరుపతి మామిడాల డైలాగ్స్ రాస్తున్నారు. ఆగస్టు 11న సినిమా విడుదల కానుంది.