'భోళా శంకర్'... స్టైలిష్ లుక్ లో చిరు

'భోళా శంకర్'... స్టైలిష్ లుక్ లో చిరు

మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో మళ్లీ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమయ్యారు. ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమాను ఓకే చేస్తూ... మాంచి ఊపులో ఉన్నారు. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ మూవీలో చిరు నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే అదే ఉత్సాహంతో మెగాస్టార్ మరో మూవీ నేమ్ ను చిత్ర బృందం అనౌన్స్ చేశారు. చిరు నెక్స్ట్ సినిమా భోళా శంకర్ గా టైటిల్ ను ఖరారు చేయగా.... రేపు చిరంజీవి పుట్టినరోజును సందర్భంగా భోళా శంకర్ సినిమా నుంచి ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. 

ఈ పోస్టర్ లో చిరు తన స్టైలిష్ లుక్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రిలీజ్ డేట్ ను కూడా మూవీ మేకర్స్ విడుదల చేశారు. వచ్చే ఏడాది అంటే 2023, ఏప్రిల్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందంటూ ప్రకటించారు. వచ్చే వేసవి కాలానికి చాలా సినిమాలు రిలీజ్ అయ్యేందుకు రెడీగా ఉన్నా... వారికి గట్టి పోటీ ఇచ్చేందుకు చిరు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా తమిళ వేదాలం కి రిమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.