భోళా శంకర్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్

భోళా శంకర్ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న భోళా శంకర్ విడుదలపై నెలకొన్న సస్పెన్స్ వీడింది. ఈ సినిమా విడుదలను ఆపాలని ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ వైజాగ్ సతీష్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. 

ఇక రిలీజ్ ఆపాలంటూ దాఖలైన పిటిషన్ ను కోర్టు కొట్టేస్తూ.. మూవీ రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ సినిమా విషయంలో తమకు రావాల్సిన రూ.30 కోట్ల రూపాయలను ఇంకా ఇవ్వలేదని, అవి ఇచ్చేవరకు భోళా శంకర్ సినిమా విడుదలను ఆపేయాలని కోరారు వైజాగ్ సతీష్. 

ఈ మూవీపై ఉన్న అభ్యంతరాలను విన్న జడ్జి, రిలీజ్ విషయంలో నెలకొన్న క్లారిఫికేషన్స్‌పై ఇరు పక్షాలు వాదనలు వినిపించారు. దీంతో ఏజెంట్ సినిమాకు ఇస్తామన్న డిస్ట్రిబూషన్ ఇవ్వకుండా ఏకే ఎంటర్టైన్మెంట్ మోసం చేసిందని, తదుపరి సినిమా విడుదలకు 15 రోజుల ముందు డబ్బు తిరిగి ఇస్తామని మరోసారి మోసం చేస్తున్నారని గాయిత్రీదేవి ఫిల్మ్స్ ఓనర్ బత్తుల సత్యనారాయణ చెప్పారు. ఇకపోతే ఏజెంట్ సినిమాతో తమకు కూడా నష్టం వచ్చిందని చెప్పిన ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్, 30 కోట్ల నష్టాన్ని వేరే మూవీ డిస్ట్రిబ్యూషన్ ఇస్తూ పూరిస్తామని క్లారిటీ ఇచ్చింది.

కోర్టులో వివరణ ఎలా జరిగింది?

వైజాగ్ సతీష్.. గాయత్రి ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ.28.30 కోట్లు ఇప్పుడే చెల్లించాలని పట్టుబడుతోన్నా తరుణంలో మొదలైన ఈ వివాదం నేటితో సద్దుమణిగింది. ఇక రీసెంట్ సక్సెస్ ఫుల్ ఫిలిం సామజవరగమన  ద్వారా గాయత్రి ఫిలిమ్స్ కు రూ.కోటి ప్రాఫిట్ ఇచ్చామని అనిల్ తెలిపారు.అలాగే తమ ప్రతి సినిమాలోనూ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని గాయత్రి ఫిల్మ్స్ కు ఇస్తున్నాం అని ఏకే ఎంటైర్టైన్మెంట్స్ వాదన వినిపించింది.  భోళా శంకర్ సినిమాలో మొత్తం పెట్టుబడి తమదే 120 కోట్లు పెట్టామని, ఇప్పటికే  ప్రీ బిజినెస్ రూ.60 కోట్ల దాకా జరిగిందని తెలిపింది. ఇంకా రూ.60 కోట్లు రావాల్సి ఉందని పేర్కొంది.

ఇక భోళా శంకర్ సినిమా విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాను దర్శకుడు మెహెర్ రమేష్ తెరకెక్కించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. ఇప్పుడు సినిమా రిలీజ్ కు  కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక భోళా మానియా రేపు ప్రతి థియేటర్ లలో ప్రారంభమవుతుంది అంటూ ఏకే ఎంటర్ టైన్‌మెంట్స్ తెలిపింది.