భోళా శంకర్ మోషన్ పోస్టర్ రిలీజ్

భోళా శంకర్ మోషన్ పోస్టర్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం భోళాశంకర్. తమిళంలో సూపర్ హిట్టైన వేదాళంకు తెలుగు రీమేక్ గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చెల్లెలి సెంటిమెంట్ ప్రధానాశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తోంది. తాజాగా భోళా శంకర్ మూవీ మేకర్స్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా చిరంజీవి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసింది.
పోస్టర్లో చిరంజీవి మాస్ లుక్ లో అదరగొట్టారు. కొత్త హెయిర్ స్టైల్, చేతికి కడియం, తాయెత్తులు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్న చిరు లుక్ ఆకట్టుకుంటోంది. 18 సెకన్ల నిడివి గల ఈ మోషన్ పోస్టర్ ను స్వాగ్ ఆఫ్ భోళా పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరిన్ని వార్తల కోసం...

1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు

15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం