1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు

1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు

ఢిల్లీ:కరోనా కొత్త వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటి వరకు 1,431 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. ఇప్పటి వరకు 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 454 ఒమిక్రాన్ కేసులు నమోదుకాగా.. ఢిల్లీలో 351, తమిళనాడులో 118, గుజరాత్ 115, కేరళలో109 మంది కొత్త వేరియెంట్ బారిన పడ్డారు. రాజస్థాన్ 69, తెలంగాణ 62, హర్యానా 37, కర్నాటక 34, ఏపీ, బెంగాల్ లో 17,ఒడిశాలో 14, మధ్యప్రదేశ్ 9, ఉత్తర్ ప్రదేశ్ 4, చండీఘడ్, జమ్ము కాశ్మీర్ 3, అండమాన్ నికోబార్ లో 2, గోవా, హిమాచల్ ప్రదేశ్, లద్దాఖ్, మణిపూర్, పంజాబ్ లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య 35శాతం పెరిగింది. శుక్రవారం 22,775 మంది కొత్తగా కోవిడ్ బారినపడ్డారు. గత 24 గంటల్లో 8,949 మంది కోలుకోగా.. 406మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం భారత్ లో 1,04,781 యాక్టివ్ కేసులున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట

న్యూ ఇయర్​కు మస్తు తాగిన్రు