న్యూ ఇయర్​కు మస్తు తాగిన్రు

న్యూ ఇయర్​కు మస్తు తాగిన్రు

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి న్యూ ఇయర్‌‌ కు లిక్కర్ ఫుల్లుగా అమ్ముడైంది. మద్యం ద్వారా సర్కార్ కు మస్తు ఆమ్దానీ వచ్చింది. డిసెంబర్ 28 నుంచి శుక్రవారం రాత్రి వరకు రూ.710 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 7.5 లక్షల కేసుల ఐఎంఎల్‌‌, 7.3 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. గతేడాది న్యూఇయర్ సెలబ్రేషన్స్ కు డిసెంబర్ చివరి నాలుగు రోజుల్లో రూ.759 కోట్ల లిక్కర్‌‌ సేల్‌‌ అయింది. అప్పుడు డిసెంబర్ 31న రూ.193 కోట్ల మద్యం అమ్ముడుపోగా, ఈసారి రూ.160 కోట్లు అమ్ముడైంది. ఇందులో 1.6 లక్షల కేసుల ఐఎంఎల్‌‌, 1.5 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఇక ఈ డిసెంబర్‌‌ లో  మొత్తంగా రూ.3,446 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. ఇందులో 40.36 లక్షల కేసుల ఐఎంఎల్‌‌, 33.92 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇదే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది. 2020 డిసెంబర్‌‌లో రూ.2,765 కోట్ల మద్యం అమ్మకాలు జరగ్గా, ఇప్పటి వరకు ఇదే రికార్డుగా ఉంది. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు రూ.23 వేల కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇందులో 2.75 కోట్ల కేసుల ఐఎంఎల్‌‌, 2.4 కోట్ల కేసుల బీర్లు ఉన్నాయి.