15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

15 నుంచి 18 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం

ఢిల్లీ : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన సర్కారు పిల్లలకు సైతం టీకాలు ఇవ్వాలని నిర్ణయించింది. 15 నుంచి 18ఏళ్లలోపు వారికి ఈ రోజు నుంచి వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించింది. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం వ్యాక్సిన్ రిజిస్టర్ చేయాలని కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యా కోరారు. రిజిస్టర్ చేసుకున్న వారందరికీ జనవరి 3 నుంచి వ్యాక్సిన్ వేయనున్నారు. 
కోవిన్ యాప్ లేదా వెబ్ సైట్ లో లాగిన్ అయి వ్యాక్సిన్ రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులేని పిల్లలు స్కూళ్లు జారీ చేసే ఐడీ కార్డులు ఉపయోగించి టీకా నమోదుచేసుకోవచ్చు. జనవరి 3 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభంకానుండటంతో కేంద్రం ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు సెకండ్ డోస్ వ్యాక్సిన్ తీసుకుని 9 నెలలు పూర్తైన హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ కు జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. 

For more news

పది మంది మంత్రులు, 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా

1,431కి చేరిన ఒమిక్రాన్ కేసులు