
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా మెహర్ రమేష్(Mehar Ramesh) డైరక్షన్ లో రాబోతున్న మూవీ ' భోళా శంకర్ "(Bhola Shankar). తాజాగా ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. భారీ ఈవెంట్ ని ఏర్పాటు చేసి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
'ఒక్కడు 33 మందిని చంపేశాడు .. ఎలా?' అనే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. ఈ మూవీ లో చిరు మార్క్ కామెడీ తో పాటు మాస్ యాక్షన్ ని ఎలివేట్ చేసినట్లు తెలుస్తోంది.
ALSO READ:అబ్బ.. ఈ పెళ్లికూతురు ఎంత అందంగా ఉందో....
ఈ టీజర్ లో చిరు చెప్పిన “' షికారుకొచ్చిన షేర్ ను బే..స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్.. ” డైలాగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ మూవీ సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కబోతుంది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా(Tamanna) హీరోయిన్ గా నటిస్తుండగా..కీర్తి సురేష్(Keerti Suresh) చిరుకు చెల్లెలుగా కనిపించనుంది.ఈ మూవీ ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్ (AK Entertinements) బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర(Rama bramham sunkara) నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.