దిష్టిబొమ్మల మిస్టరీ.. ఊహకందని కథనంతో భూతద్ధం భాస్కర్

దిష్టిబొమ్మల మిస్టరీ.. ఊహకందని కథనంతో భూతద్ధం భాస్కర్

శివ కందుకూరి(Shiva Kandukuri) హీరోగా పురుషోత్తం రాజ్(Purushottam Raj) దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ భూతద్ధం భాస్కర్ నారాయణ(Bhoothaddam Bhaskar Narayana). స్నేహాల్, శశిధర్, కార్తీక్ నిర్మాతలు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ శనివారం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌‌‌‌‌లో జరిగింది. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంటెంట్ విషయానికొస్తే.. ఏపీ, కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో వరుస హత్యలు జరుగుతుంటాయి. అవి సీరియల్ కిల్లర్ చేస్తున్నవా లేక ఎవరైనా బలి ఇస్తున్నారా అనే మిస్టరీని.. డిటెక్టివ్ భాస్కర్ నారాయణ ఎలా పరిష్కరించాడు అనేది మెయిన్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌.

ఇక ముఖ్య​అతిథిగా హాజరైన విశ్వక్‌‌‌‌‌‌‌‌ సేన్‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ ‘ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. శివ చాలా ప్రామిసింగ్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తున్నాడు. చాలా గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌గా తీశారని అర్థమవుతోంది. టీమ్ అందరికీ ఆల్‌‌‌‌‌‌‌‌ ది బెస్ట్‌‌‌‌‌‌‌‌’ అని చెప్పాడు. హీరో శివ కందుకూరి  మాట్లాడుతూ ‘పురాణాలతో ముడిపడిన యూనిక్ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో తీసిన చిత్రమిది. కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నాం. ప్రేక్షకులకు చాలా కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. దర్శకుడు మాట్లాడుతూ ‘అందరి ఇంటిముందు ఉండే దిష్టి బొమ్మ  గురించే ఈ కథ. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  రివీల్ చేయని ట్విస్ట్ లు సినిమాలో చాలా ఉన్నాయి’ అని చెప్పాడు. ‘మార్చి 1న సినిమా వస్తోంది. మంచి థ్రిల్లర్. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు’ అని నిర్మాతలు తెలిపారు.