వాహనాల వేస్టేజీతో అతి పెద్ద 'రుద్ర వీణ' తయారీ.. మధ్యప్రదేశ్‌లోని కళాకారుల బృందం ఘనత

వాహనాల వేస్టేజీతో  అతి పెద్ద 'రుద్ర వీణ' తయారీ.. మధ్యప్రదేశ్‌లోని కళాకారుల బృందం ఘనత

మధ్యప్రదేశ్‌లోని ఓ కళాకారుల బృందం ఆరు నెలల పాటు శ్రమించి వాహనాల స్క్రాప్, చెత్తతో ప్రపంచంలోనే అతిపెద్ద 'రుద్ర వీణ'ను నిర్మించింది. భారతీయ సాంస్కృతిపై కొత్త తరానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఆలోచన చేశామని కళాకారులు చెబుతున్నారు. ఈ వీణ 28 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తు ఉంది.

ఇంకోముఖ్య విశేషమేమిటంటే దీని తయారీకి కళాకారులు దాదాపు రూ.10 లక్షలు వెచ్చించారట. అంతేకాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రుద్ర వీణ అని ఈ బృందం పేర్కొంది. రుద్ర వీణను చైన్లు, గేర్, బాల్ బేరింగ్, వైర్ మొదలైన వాహనాల స్క్రాప్‌లతో అద్భుతంగా తయారు చేశారు. మొత్తం 15 మంది కళాకారులు కలిసి దీన్ని డిజైన్ చేయడం, సేకరించడం, ఆపై ప్రత్యేకమైన వీణను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 

రుద్ర వీణను ప్రస్తుతానికి మధ్యప్రదేశ్‌ నగరంలోని అటల్ పాత్ లో ప్రదర్శనకు ఉంచనున్నట్టు కళాకారుల బృందం పేర్కొంది. భారతీయ సాంస్కృతి గురించి భవిష్యత్ తరాలకు మరింత తెలియజేసే ఉద్దేశంలో భాగమే ఈ కాన్సెఫ్ట్​ అని తెలిపారు. రుద్ర వీణ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు వీలుగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అంతేకాదు.. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వీణ అని వారు స్పష్టం చేశారు.