ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్య

ప్రియురాలితో భర్తకు పెళ్లి జరిపించిన భార్య

మీకు ” మా ఆవిడ మీ ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ” అనే సినిమా గురించి తెలిసే ఉంటుంది. ఆ సినిమాలో  వడ్డె నవీన్ ,రాశి ప్రేమికులు. గాఢంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అనుకున్నారు. కానీ నవీన్, రాశిలు పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో రాశిని..,శ్రీకాంత్ కు ఇచ్చి వివాహం చేస్తారు. నవీన్ ని లయతో వివాహం జరిపిస్తారు. వివాహం అనంతరం తన భార్య రాశి..,నవీన్ ను ప్రేమించిందని వాళ్లిద్దరికి పెళ్లి చేయాలని భర్త శ్రీకాంత్ అనుకుంటాడు. కాని భార్య రాశి తన భర్త శ్రీకాంత్ ను విడిచి వెళ్లేందుకు ఒప్పుకోదు. అదే స్టోరీ నిజ జీవితంలో జరిగింది. సినిమాలో భార్య ప్రేమను భర్త అర్ధం చేసుకుంటే ..నిజ జీవితంలో భర్త ప్రేమను భార్య అర్ధం చేసుకుంది.

భోపాల్ కు చెందిన భార్యభర్తలు. భర్త  పెళ్లికి ముందు ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపించాడు. కానీ కొన్ని అన్వేక కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయాడు. ఇంట్లో పెద్దలు కుదుర్చిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లైతే అయ్యింది కానీ తాను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు. నరకవేదన అనుభవిస్తున్నాడు. ఓరోజు ధైర్యం చేసి తాను తన ప్రియురాల్ని పెళ్లి చేసుకుంటానని, ముగ్గురం కలిసి జీవిద్దాం అంటూ తన నిర్ణయాన్ని భార్యకు చెప్పాడు. అయితే పెళ్లికి చట్టం ఒప్పుదని భార్య చెప్పింది. తన భర్త సంతోషంగా ఉండాలనుకున్న ఆ భార్య తన భర్తకు విడాకులిచ్చింది. తన భర్త  ప్రేమించిన అమ్మాయితో వివాహం జరిపించింది. ఈ విడాకుల కేసును వాదించిన మహిళా న్యాయవాది ఈ విషయాన్ని చెప్పింది. ప్రస్తుతం ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.