శ్రీశైలం డ్యామ్ వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. డ్యామ్ దగ్గర విధులు నిర్వహించే ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి గుండెపోటుతో (52)మృతి చెందాడు. డ్యామ్ లో జలాశయం లిఫ్ట్ దగ్గర విధులు నిర్వర్తిస్తుండగా ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరస్వామిపై ఒక్కసారిగా తేనెటీగల దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరాస్వామి గుండెపోటుకు గురై మరణించాడు.
తేనెటీగల దాడిలో మరో ఇద్దరు సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. అయితే పక్కనే ఉన్న తోటి సిబ్బంది హుటాహుటిన సుండిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలోపే వీరస్వామి మృతిచెందాడు. వీరస్వామి మరణంతో ఒక్కసారిగా తోటి ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వీరస్వామి చీరాల దగ్గరలోని ఓగ్రామనికి చెందిన వ్యక్తి. అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
