ఖమ్మం జిల్లాలో హైఅలర్ట్.. గుడిసెలు తొలగించిన అధికారులు.. పోలీసుల లాఠీఛార్జ్?

ఖమ్మం జిల్లాలో హైఅలర్ట్.. గుడిసెలు తొలగించిన అధికారులు.. పోలీసుల లాఠీఛార్జ్?

ఖమ్మం జిల్లా  వెలుగుమట్లలో జులై 15న తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నాయి.   భూదాన్‌ భూముల్లో పేదలు వేసుకున్న గుడిసెల కూల్చివేతకు అధికారులు వచ్చారు. వారిని అడ్డుకునేందుకు స్థానికులు తరలివచ్చారు. ఇరువర్గాల రాకతో ఆ ప్రాంతంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. అధికారులు రాగానే స్థానికులు వారిని అడ్డుకున్నారు.  దీంతో మధ్య ఘర్షణలు జరిగాయి. పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నా.. ప్రజలు వెనకడుగేయట్లేదు. తమ స్థలాల్లో వేసుకున్న గుడిసెలను ఎందుకు తొలగిస్తారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో లాఠీఛార్జ్ అయిందని సమాచారం. 

ఇదీ చరిత్ర.. 

ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో 147, 148,149 సర్వే నంబర్లలో భూదాన్‌కు సంబంధించిన 62 ఎకరాల  భూమి ఉంది. 2014లో ఈ భూములకు సంబంధించి స్థానికులు దరఖాస్తు చేసుకున్నారు.   ఆ భూముల్ని ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటి నుంచి ప్రభుత్వానికి స్థానికులకు మధ్య వివాదం నడుస్తోంది. ఏళ్లుగా పోరాటం చేస్తున్న భూములు పంచట్లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటిని ఇచ్చే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేస్తున్నారు.