- నియోజకవర్గంలో బోణి కొట్టిన కాంగ్రెస్
ముస్తాబాద్, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని హిరలాల్ తండా గ్రామంలో సర్పంచ్ గా భూక్యా పద్మాదేవ్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడిన మొదటిసారి సర్పంచ్ ఏకగ్రీవం కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం గ్రామంలో జరిగిన సమావేశంలో పద్మాదేవ్ సింగ్ ను సర్పంచ్ గా ఏకగ్రీవంగా ప్రకటించారు. ఉప సర్పంచ్ గా అజ్మీర కిషన్ ఎన్నికయ్యారు. గంభీరావుపేట మండలంలో మొదటి ఏకగ్రీవ గ్రామంగా హీరాలాల్ తండా నిలిచింది. దీంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ బోణి కొట్టింది.
