తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి..

తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి..

తిరుమల పరకామణి కేసులో సీఐడీ విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. మంగళవారం ( నవంబర్ 25 ) సీఐడీ విచారణకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కార్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తనకు భూమికి నక్షత్రానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. తనను ఈ కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బీఆర్ నాయుడు, ప్రకాష్ రెడ్డి, లోకేష్, వార్ల రామయ్య, పట్టాభి విచారణకు పిలిచారని అన్నారు భూమన.

కూటమి ప్రభుత్వాన్ని మోసే మీడియా వాళ్లకు కావాల్సిన విధంగా నింపేశాయని.. పోలీసులు కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి విచారణకు పిలిచారని అన్నారు భూమన. పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్ళున్నాయి, నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉన్నాయి.. 15 వందల సంవత్సరాలుగా తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించినవారు ఎంతమంది అని ప్రశ్నిస్తే ఏం సమాధానం ఇస్తానో.. ఈ కేసుతో తనకు అంతే సంబంధం ఉందని అన్నారు భూమన. అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇచ్చానని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

ఈ కేసులో విచారణ  హాజరైన మాజీ టీటీడీ  బోర్డు సభ్యులు అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నవంబర్ 2021 నుంచి డిసెంబర్ 2023 వరకు బోర్డు సభ్యులుగా ఉన్నానని.. పరకామణి కేసు బోర్డులో పెట్టినప్పుడు తాను లేనని అన్నారు. ప్రభుత్వాలు, రాజకీయంగా ఒత్తిళ్లతో తనను విచారణకు పిలిచారని అన్నారు అశోక్ కుమార్. శ్రీవారి ఒక్క నాయపైస తిన్నా..  వారిని దేవుడే శిక్షిస్తారని అన్నారు. వైవీ సుబ్బారెడ్డి రెండు సార్లు చైర్మెన్ గా ఉన్నారని.. మొదటిసారి బోర్డు చైర్మెన్ గా ఉన్నప్పుడు మాత్రమే తాను సభ్యునిగా ఉన్నానని అన్నారు అశోక్ కుమార్.