గురువారం ( అక్టోబర్ 3, 2024 ) తిరుపతిలో వారాహి బహిరంగసభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీటీడీ మాజీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే ఆయన నటించిన సినిమాలోని కెవ్వు కేక పాట గుర్తొస్తుందని అన్నారు. పవన్ స్వాముల వారు దీక్ష చేపట్టి జగన్‌పై పవన్ ఇష్టానుసారంగా మాట్లాడారని అన్నారు.పవన్ గతంలో ఏనాడూ సనాతన ధర్మంపై మాట్లాడలేదని పవన్ కొత్త పాఠం వెనుక వేరే అజెండా ఉందని అన్నారు భూమన.
పవన్ స్వాములవారు పూటకో మాట మాట్లాడుతున్నారని.. వైష్ణవ ప్రచారం చేసిన ఆళ్వార్‌లా మాట్లాడుతున్నారని అన్నారు భూమన.సుప్రీంకోర్టులో ఉన్న అంశంపై ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లక్ష లడ్డూల్లో జంతుకొవ్వు కలిసిందని..పవన్ కల్యాణ్ మాట్లాడటం సరికాదని అన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.